responsibility telugu

మనిషి -బాధ్యతలు

మనిషి – బాధ్యతలు

 

 భాద్యతలు అన్నవి పలురకాలుగా ఉంటాయి . అవి జన్మతా కొన్ని, ఉద్యోగ రీత్యా

కొన్ని , చుట్టూ ఉన్న వాతావరము , వాళ్ళ మానసిక పరిస్థితి ఇన్ని ఒకమనిషికి

ఎదుగుదలకు మానసిక వికాసానికి కరణభూతము అవుతాయి.

 

అందరి త్వత్వాలు ఒక్కలా ఉండవ్. వారి వారి మనస్వతవాలా కారణాలు కూడా ఈ

భాద్యతలు నిర్వహించడము పై ఆధారపడి ఉంటుంది .

తల్లి భాద్యత :-

 

ఒక తల్లి దగ్గర పెరిగిన వాతావరణము ఆ తల్లి చాలా ఈజీగా తీసుకుని కొన్ని

మాటలు తనకు తెలియకుండానే తనపిల్లలు కు తెలియజేస్తుంది.

 

ఆ మాటలు బిడ్డల మీద ప్రభావాలు చూపుతాయి . జరిగినది వెనుకకు తీసుకోలేము కానీ ముందు

ముందు జరగవలిసిన విషయాలకు ప్రతీ తల్లి ఒక్కసారి మీ బిడ్డలు ఎలావుండాలి అని

మీకు మీరు ప్రశ్నించుకోండి.

 

చాలావరకు సమాధానము మీ మనస్సుకు తెలుస్తుంది .

ప్రతీ ఒక ఆడబిడ్డ ముందు నేర్చుకోవాలిసినది ,ఓర్పు , ఈరోజులలో కూడా ఓర్పు

కోసము చెప్పడము ఏమిటి అని అనుకుంటున్నారా ?

 

అవును ఓర్పుకూడా ఒక ఆయుధమే , సమానత్వమంటే, ఒక మగాడితో పోల్చుకొని వాడికన్నా ఆడవాళ్లు ఎక్కువ

అని చాటడము కాదు.సమానత్వము అంటే . ఆ మగవాడినిని కూడా కన్నది ఒక ఆడదే . వాడికి బుద్దిని ,

మాటలు నేర్పగలిగినదీ ఒక ఆడదే .

 

సంస్కారాలు నేర్పగలిగేది ఒక ఆడది . ఈరోజులలో ప్రతీ ఇంట T .V .లు సీరియళ్లు

దానిలోని పాత్రలు యొక్క ప్రభావాలు మన మీద మన పిల్లల మీద కూడా ప్రభావము

చూపుతున్నాయి .

 

తల్లిగా తమ భాద్యతలు సక్రమముగా నిర్వహిస్తున్నామా అని ప్రతీ

పేరెంట్ తప్పని సరిగా ప్రశ్నించుకోవాలి .దేవుడు ఎక్కడో లేడు,మన ఆలోచనాసరళిని

అనుసరిస్తూ మన బాధ్యతల సక్రమమైన నిర్వ్హణద్వారా ఫలితాలు ఉంటాయి , ప్రతీ

బిడ్డ ఈ మార్గము ను నేర్చుకోవాలిసిన మొదటి పాటము ఇదే .

 

మీ బిడ్డల యొక్క ఉన్నతి మీరు కోరుకున్నట్లైతే ,వాళ్ళు తమ తప్పుఒప్పుల తమకు తామే తెలుసుకునేటట్లు మీరు

చేయగలిగితే , వాల్లజీవితము నిరంతరము ఒకరక్షణ వలయము మీరు ఏర్పాటు చేసినట్లే .

ఉద్యోగ భాద్యత :-

 

ఉద్యోగములో చేరిన కొత్తలో చాలా ఉన్నతమైన భావాలూ ఉన్నవాళ్లు కూడా రోజులు

గడిచేకొలదీ మార్పులు రావడము మనము చూస్తాము . ఈ సమాజములో అన్నిటికన్నా ధనానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడము జరుగుతుంది, దానికి మనము సాధ్యమైనంత దూరముగా ఉండాలి .

 

ఎవ్వరైనా ఏదైనా వాల్యుబుల్ వస్తువు కొంటే

దానిని కోన గల సామర్ధ్యము అవకాశము వుందో లేదో (ఇంటిలోని పేరెంట్ , భార్య ,భర్త

పిల్లలు) అందరూ తెలుసుకోవాలిసిన భాద్యత ఇంటి లో వాళ్ళమీద ముఖ్యముగా

పసిబిడ్డల మూడు ,నాల్గు ,సం.రా //లు .నుండి ,ప్రతీ ఒక్కరికి ధైర్యముగా

చెప్పగలిగిన నాడు వాళ్ళు పెద్దగా ఆశ పడడము జరగదు .

 

మన ప్రతీ చర్యను అందరికి చెప్పగలిగిన వారిలో వారు చేసే పనులు కూడా ఆదర్శ వంతముగా ఉంటాయి .

మన దేశములో సమస్య ఎక్కడవుందో అక్కడ వదిలేసి మన ప్రక్కన ఉన్నవారి మీద

నేరము మోపడము జరుగుతున్నది .

 

ఒకమనిషికి కావలిసినది ఆలోచనా శక్తి ,దానిని పెంపొందిచవలిసిన ఏ గవర్నమెంట్ వచ్చినా తన భాద్యతను సక్రమముగ

నిర్వహించడము లేదు. ప్రజలకు ఫ్రీ అని సోమరురులుగా తాయారు చేయడమే

వాళ్ళ లక్షయముగా మారుతుంది ఇన్ని కోట్లు డబ్బు ఖర్చు చేసినా

జీ వితములో ఒక దారికి రాలేకపోవడానికి కారణాలు ఎడ్యుకేషన్ లో మొరాలిటీ

లేకపోవడము .

 

వాళ్ళకి ముఖ్యముగా నేను ఇందులో చెప్పదలుచుకున్నది ఏ మంటే

రేపటి రోజు మన సంతతి ఆరోగ్యముగా మారాలంటే మనకి విద్య ,ఆరోగ్యము

ప్రజలందరికి ఫ్రీ గా ఉండాలి .దానిద్వారా చాల వరకు పేద గొప్ప వ్యత్యాసము

తగ్గుతుంది.

 

విద్య ద్వారా మనము పొందిన జ్ఞానాన్ని మన ప్రజలకే చెందాలి . ఇతర దేశములో

అక్కడికి మనదేశాభి వృద్ధికి ఉపయోగపడే విద్య కోసము వెళ్ళాలి గానీ అక్కడ

స్థిరపడటం తగ్గించాలి.ఇది పూర్తిగా పెద్దవాళ్ళు నిర్ణయాలు తీసుకొంటేగానీ ఇది

జరగదు ,ఈ బాధ్యత పూర్తి గా గవర్నమెంట్ తీసుకోవాలిసినది ఇది చట్టము ప్రకారము

అమలు లోకి వస్తే , 70 వ. //లు పూర్తి అయినా ఇంకా పేదరికము అనే దుస్థితి పోతుంది .

 

ఒక జవాను గా వెళ్లి మనదేశము పై తన బాధ్య తలను వారు నిర్వహించగలిగితే,

ఒక భాద్యత కలిగిన పౌరుడుగా ,మనచుట్టూ ఉన్న ఈ సమాజానికి కాపలాగా మనమంతా

ఉండవలిసిన భాద్యత మన అందరిమీదఉంది .

 

ఒక టీచరుగా డాక్టర్ గా లాయరుగా సైంస్టిస్ట్ , బాధ్యతాయుతమైన ఉద్యోగులు ,వ్యాపారాలు చేసే గొప్ప గొప్ప

వ్యాపారులు అందరమూ ,మన మన భాద్యతలను సక్రమముగా నిర్వహిద్దాము .

 

అలానే మనకి మానుఫ్యాక్చర్ విషయము లో గానీ ,పారిశుద్ద విషయములో గానీ మనము ఇంకా

ఎక్కువగా తక్కువ ఖర్చు తోనే ,కొబ్బరి, తాటి, చెట్లు ఎక్కడానికి , గార్డినింగ్ , కమ్మరి ,

కుమ్మరి పాలవ్యాపారములో ,వడ్రంగి ,మొదలగు వృత్తులవారికి సరి అయిన

పరికరాలు తేలికగా తమ పనులు తాము చేయటానికి కొత్తగా కనిపెట్టవలిసిఉంది .

 

ఇందులో మన ప్రధానిమంత్రీ గారు ఈ విషయమే చాలా

సందర్భాలలోచెప్పుతున్నారు . ఇవిఅన్ని అవగాహన చేసుకోని ” సొంత లాభము కొంత

మానుకుని పొరుగువాడికి సాయపడవోయి ” మనగుజాడ అప్పారావు గారి మాటలను

గుర్తుకు తెచ్చుకుంటూ.మనభాద్యతలను సక్రమముగా నిర్వహిద్దాము.

 

మనిషి సంఘ జీవి ,మనిషి ఒక్కడు , బతక లేడు,మనిషి పుట్టినప్పటినుండి మనిషి

చనిపోయేవరకూ ప్రక్కవాడి తో ,కుటుంభం సభ్యులతో ,తల్లి, తండ్రి ,అన్న ,తమ్ములు

భంధువులు ,స్నేహితులు ,పిల్లలు పెద్దలు , అందరితో సంబంధమున్న మనిషి ,వారి

ప్రేమ అనుబంధాలు ఎప్పటికి మరవకూడదు .

 

ఆ స్పందనను మరవానంతకాలము మనిషి సుఖసంతోషాలతో ఉండగలుగుతాడు .ఆ మనిషి లో స్వర్డము ఎపుడు మొదలు

ఉంవుతుందో అప్పుడే మనిషి పతనము మొదలు అవుతుంది . నేను ,నా యొక్క

భాద్యత అన్నది దైవము తో సమానముగా మనము భావిచ్చిన్నప్పుడు ప్రతీ ఒక్కరు

తమ తమ భాద్యతలు సక్రమముగా నిర్వహిద్దాము.

 

ఇక్కడ మనిషి అన్నపదము (ఆడ-మొగ) ఇద్దరికి సంభందించింది . ఒకఉద్యోగి తన భాద్యతలను , ఒక టీచర్ ,తనకు

సంభందించిన అంతవకూ తనభాద్యతలు ,అవి నిర్వేసహించడమువరకే భాద్యత .కానీ

కొన్ని కీలకమైన భాద్యతలు ఉంటాయి .అవి ఒక్కరి తో భాద్యత తీరి పోదు .దాని

ప్రభావము అందరి జీవితాలమీద ,ప్రభావము చూపుతాయి .

 

అందుచేత వారి యొక్క

నిర్ణయం ద్వారా తెలుస్తులుండి . ఒకవిధముగా వారిచేతీలో అధికారాలు ఉంటే

వారియొక్క నిర్ణయాలతో ఏమైనా చేసి తీరుతారు . అలాంటి వారిని ,కుటుంభ సభ్యులు

మాత్రమే మార్పు తేగలరు .

 

ఈ భాద్యతలను అందరమూ సక్రమముగా నిర్వహించ గల

పరిస్టిస్తులు మానసిక ధైర్యము ఒక సమస్య పై పరిపూర్ణ అవగాహన చేసుకొని మన

భాద్యతలను మనమే తెలుసుకొని ,ముందుకు అడుగు వేద్దాము .

 

మనమందరము ,తల్లికి బిడ్డగానూ, బిడ్డకు, తల్లిగాను, తండ్రిగాను,అక్క- చెల్లెల్లు ,అన్న-

తమ్ముళ్లు,తాతగా, అమ్మమ్మగా ,నానమ్మ, మామయ్య, బాబ్బాయి ,పిన్ని అత్తయ్య, మేనల్లులూ ,మేనకోడలు, మనుమలు,

మనుమరాండ్రు, ఎలా చెప్పుకుపోతే ,ఎంతటి తీయనియ్యనివి ,ఈ అనుబంధాలు ,

ఒక్కసారి గడిచిన ఒక్క నిముషయము కూడా తిరిగిరాదు.

 

రేపు ఏమిజరుగుతుందో మనకు తెలియదు . గాలి, నీరు, వెలుతురు ,అందరి కి ఒక్కలానే ఉన్నాయి .

మునుషుల్లో తేడాలు మనము నిర్మిచుకొన్నవి .మనమంతా మన భాద్యతలను

సక్రమముగా నిర్వహిద్దాము .

 

మనవంతు భరతమాత బిడ్డలుగా మన సంకృతిని,మన

సంప్రదాయాలను కాపాడు కుంటూ ,ముందుకి అడుగు వేద్దాం .