parent-school Relationship

parent-school Relationship

parent-school Relationsh
The  parent-school relationship is very important

 

ముఖ్యముగా ఇక్కడ తెలియ జేయవలిసినది ఒకటి ఉన్నది .ఏ పేరెంట్ కూడా తమ పిల్లల యొక్క భవిషత్ కోసం మాత్రమే ఆలోచిస్తారు ,ఇందులో ఎలాంటి అనుమానము లేదు.అయితే ,ప్రతీ బిడ్డ ప్రయోజకుడు ఎందుకు కావటం లేదు ? ప్రతి స్కూల్ మంచిగా అన్ని విష్యాలలో No -1 . గానేఉండాలని కోరుకుంటుంది.ఎందుకు ప్రతీ స్కూల్ మంచి పేరు తెచ్చుకోవడం లేదు?వీటి యొక్క ఈ క్రింద న పేర్కొన బడిన లిస్ట్ చూద్దాము.

పేరెంట్& స్కూల్స్ 

 

1 .ముఖ్యముగా పేరెంట్స్ స్టూడెంట్స్ యొక్క ఉన్నతి ఓన్లీ స్కూల్స్ పైనే ఉంది .అని నమ్మడం .

2 .రెండు తమ పిల్లయొక్క ఉన్నతి పేరెంట్ ప్రతీ మాటా మీ పిల్లయొక్క మోనోభావాలపై పడుతుంది,అన్నది మరిచిపోవడం

మొట్టమొదట గురువు బిడ్డ కు తల్లి .

 

3 .పిల్లల యొక్క ప్రవర్తన  ఒక్క రోజులో వచ్చేదీ కాదు ,మారేదీ కాదు, ప్రతీ పేరెంట్ ముందుగానే, మీపిల్లయొక్క ఉన్నతి అంటే మీరు మీపిల్లలు ఎలావుండాలి అనుకుంటున్నారు ?అన్నది ఒక అవగహన కు రావడమైతే , చాలాముఖ్యము .

4.        పేరెంట్ కి పిల్లలపై మమకారము విషయములో ఎలాంటి అనుమానము లేదు .ఆ మమకారంతో ,తమ పిల్లలకి ఎలాంటి కష్టము తెలియకుండా పెంచడం మాత్రమూ చాలా ప్రమాదానికి దారి తీస్తుంది. ఏచెట్టు నుండి అయినా మనము ఫలం ఆశిస్తే ,ఆ ఫలం పొందడానికి చెట్టు బట్టి టైం ,ఏ ఫలం కావాలో ఆ చెట్టు నేపెంచుతాము .అంటే మనము దీనిబట్టి,ఏదైనా ఒకే సారి మొక్క నాటిన నాడే  మనకు దొరకదు.  మనము ఏదియైతే  తినాలి అని అనుకుంటామో, దానినే వంట చేస్తాము .తినే టప్పుడు ఆ రుచి మీకు నచ్చలేదు, అంటే ఆ వండినది మనమే కాబట్టి ,ముందుగా ఆ రుచి తెలిసి ఉంటే ,మీకు నచ్చనిది మీరు తయారు చేయరు.అందుకే ముందు గానే మీపిల్లలు ఎలా ఉండాలి అన్నది ప్రతీ పేరెంట్ మీపిల్లకి ఉగ్గు పాల తో పాటు మీ ఆసియాలను కూడా చెపుతూ పెంచినట్లైతే ,మీరు కోరు కున్నట్లు మీపిల్లల భవిషత్ ఉంటుంది.

ప్రతీ కుటుంబము ఒక పాఠశాలే .

 

5.               ఇలా రాసినంత  మాత్రాన  అందరు మారతారా అనిఅడిగేవాళ్ళకి మనము ప్రయత్నం అన్నది చేయాలి కదా : పిల్లలకి ఇంటి వాతావరణము బట్టి ,వాళ్ళ ఆలోచన విధానము ఉంటుంది. అమూల్యమైన  సంపద కుటుంభ సభ్యులకే కాదు ,రాష్ట్రాలకి,దేశానికి కూడా.అందుకే  మీపిల్లల యొక్క ఉన్నతి పేరెంట్ యొక్క స్థితిగతులపై   కన్నా పేరెంట్స్ యొక్క ఆలోచన విధానము పై ఉంటుంది . వాళ్ళ కుటుంభ సభ్యులపై కూడా ఉంటుంది.

మీదగ్గర ఉన్న చిన్న పిల్లలే రేపటి దేశ సంపద

 

స్కూల్స్ లో నేర్పగలిగినవి సిలబస్ బట్టి ,చాలా వరకు పూర్తిచేస్తూ ఉంటారు. ఇప్పుడు చదువులు అన్ని ఆన్లైన్ లోనే జరుగుతున్నాయి .(కరోనా) మూలం గా అందుచేత పిల్లలు వాళ్ళకి ఏమిచేయాలో తెలియక వాళ్లు కోరుకున్నది జరగడం కోసం పలువిధాలుగా పెద్దవాళ్ళని విసిగిస్తూ ఉంటారు .వాళ్ళకి ఎదో పని చేయడం నేర్పితే ,ఆ పనిమీద మైండ్ పెట్టడం వలన వాళ్ళ అల్లరి కూడా చాలావరకూ కంట్రోల్ లో ఉంటుంది.

దేశమంటే మట్టికాదోయ్  దేశమంటే మనుషులోయ్

 

ప్రతీది మీరు కొంత వయస్సు వచ్చేవరకు ఎడ్యుకేషన్ దృష్టిలో ఉంచుకొని మీమాటలతో వాళ్ళకి ఎడ్యుకేషన్ మీద ఒక అమూల్యమైన సంపదగా వారిని మీరు మాటల ద్వారా మార్చగలిగితే ,మీ పిల్లలయొక్క భవిషత్  పిల్లలకి కూడా పదిహేను సం //లు, తరువాత ఏమిజరుగు తుందో పేరెంట్ వారిపిల్లకి కూడాఅవగతం అవుతుంది . ఏ పేరెంట్ మీ పిల్లలు దూరమయ్యారు అని భాదఉండదు.పిల్లలకి తాముకోరుకున్నది తాము పొందలేదు అన్న బాధ ఉండదు ముఖ్యముగా  నేను ఇందులో చెప్పా దలుచుకున్నది ఏమిటి అంటే ,time చాలా విలువ అయినది .దానిని మీరు ముందుగా గ్రహించ గలిగితే రేపటి పౌరులు అభివృద్ధి బాగుంటుంది, “దేశమంటే మట్టికాదోయ్ ,దేశమంటే మనుషులోయ్”,  అన్న మన గురజాడ అప్పారావు గారి మాటలు గుర్తు పెట్టు కోవలిసిన అవసరం ఉంది .

పేరెంట్ చేయవలిసినవి ఇక్కడ మనము చేర్చించడం జరిగింది .మిగిలినవి విషయాలు  రేపటిభాగములో చెప్పుకుందాము

B .N .Mani

.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *