Telugu Mathru basha

Telugu Mana Mathru Bhasha

తెలుగు మన మాతృ భాష:

మనపిల్లల యొక్క ఉన్నతి ముఖ్యము కావాలి, ఇది మనము కాదనలేని నిజము. ఆ ఉన్నతి మాతౄ భాష అంటే ఏమిటి అని ఒక 5 ఇయర్స్అబ్బాయి , నన్ను అడిగినప్పుడు , నేను మనఅందరము మాట్లాడేభాష అని చెప్పను.

దానికోసము రోజు న్యూస్ లో చెప్పుతుండము తో చిన్న పిల్లలకే ఇంత ఆలోచనలు వస్తున్నప్పుడు ,మనకి ఎంత ఆలోచించి ,నిర్ణయాలు తీసుకోవాలిసి ఉంది ?

మన ఎడ్యుకేషన్ విధానాలతో అప్పుడు ఇప్పుడు కూడా ఏది మంచిది రేపటి తరాన్ని ఎలా తాయారు చేయాలి అన్నది ఒక పెద్ద సమస్యగా ఉంది . ఇది ఏ ఒక్కరి నిర్ణయాలకు మూలాధారము కాకూడదు.

సమస్య అంతా కూడా ఎక్కడ ఉంది అంటే ,ఒక్క ఇంగ్లీష్ రాకపోవడము లో నే ఉందని అనుకుంటే అంతకన్నా తప్పు నిర్ణయము ఇంకో ఒక్కటి లేదు .

మనము నేర్పాలి గానీ చిన్నతనములో ఒక స్టూడెంట్ ,రెండు ,మూడు భాషలు ,నేర్చుకో గల శక్తి ఉంటుంది . అది సిలబస్ లో మార్పులు చాల చాలా అవసరము .

దానికి తగ్గా అవసరమైన సిలబస్ ను ముందుగా ప్రిపేర్ చేయవలసిఉంది .1st , std . నుండి మీడియం తెలుగులో ఉంచి ప్రతీ వర్డుకి మీనింగ్ తెలుగు ,ఇంగ్లీష్ లో ఉండాలి.

ఎదో ఒక భాష ప్రాముఖ్యత ఇవ్వడముకాదు,ప్రతీ స్కూల్ రెండు భాషలను అలవాటు చేయాలి అంటే L .K .G .నుండి కూడా ఫస్ట్ తెలుగుకి తరువాత ఇంగ్లీషుకి ,ప్రాధాన్యత ఇచ్చినప్పుడు దానిప్రకారం సిలబస్ మార్చినప్పుడు , ముఖ్యముగా టీచింగ్ స్టాఫ్ సరైన శిక్షణ పొందిన వారై ఉండాలి .

టీచింగ్ స్టాఫ్ ఓన్లీ laguages కి ప్రతేక ట్రయినింగ్ తీసుకొన్నవాళ్ళు మాత్రమే ఉండాలి .
తెలుగు ,ఇంగ్లీష్, ఈ రెండు L .K .g నుండి రెండు languages నేర్పటమూ పెద్దకష్టము కాదు.

మాథ్స్ ,సైన్స్, సోషల్, కూడా 5th క్లాస్ వరకూమీనింగ్స్ తెలుగు ,ఇంగ్లీషులో, ముద్రింప బడాలి .వాటిలో ఈ మూడు సబ్జక్ట్స్ ఎక్సమ్స్ ,తెలుగులో కండక్ట్ చేయ గలగాలి .6th క్లాస్ నుండి కంప్లేసరీ అప్పుడు ఇంగ్లీష్, తెలుగు, హిందీ ,తప్పనిసరి
చేసినట్లహితే , చాలావరకూ మనము స్టూడెంట్స్ కి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళ భవిషత్ నిజముగానే బంగారుబాట గా చేయగల్గుతాము.

చిన్నతనము నుండి రెండు languages లో వాళ్ళకి తెలుగు ఇంగ్లీష్ , ఉండుటచేత 6th క్లాస్ కి నుండి తెలుగుకి ప్రాముఖ్యత పెంచుట కొరకు తెలుగులో నీర్దిష్ఠ marks కొలమానము కావాలి .

ఆ తెలుగులో marks ప్రాముఖ్యత ఎక్కువ చేయడము తో సరి అయిన విధానము ఏర్పాటు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి .

ఇది ఎదో తొందర పాటు తో తీసుకోవాలిసిన నిర్ణయము కాదు ,దీనికి సంభందించిన అనేకమైన మేధావులు ఉన్నారు .

దీనికి సంబంధించిన వారి సలహా లు దృష్టిలో పెట్టుకోవాలిసి అవసరము ఉంది .దానికి సంభందించిన వారి అభిప్రాయములతో ముందుకు పోవాలి .

education విధానములో లోపము గానీ ఇది తెలుగు మీడియం వల్ల జాబ్స్ రావడము లేదనుకోవటము ఇది చాల చాల తప్పు ఆలోచన .

దీనిని ఎవ్వరు కాదనలేని నిజము.కానీ, మొన్నటి వరకు అన్ని సబ్జక్ట్స్ తెలుగులో భోదించి , 5 వ. తరగతి లో A .B .C .D . లు నేర్పి ,ఇప్పుడు పూర్తిగా ఇంగ్లీషుమీడియం లో నేర్పుతాము అన్నది ఎంతవరకూ సబబు ,ఆలోచిం చండి .

అందరు సంతోషిచతగ్గ నిర్ణయము తీసుకుని ,దానికి ఎంతో డబ్బును కూడా ఖర్చు చేయడాన్నికి కూడా సిద్దమైనదులకు మనము సుంతోషియించాలి .

కానీ తొదర పడవద్దు .మాటలతో కాదు బుద్ది తోఆ లోచన చేయాలి . ఎట్టి పరిస్థితిలోను తెలుగును వీడ వద్దు .

ఒకటో తరగతి నుండి తెలుగు ఇంగ్లీష్ ని ప్రర భించుట ,దానికి తగ్గ టీచింగ్ స్టాఫ్ ని దానికి తీసుకోవాలిసి జాగర్తలు , అన్ని ఒక ప్రణాళికగా చేస్తే ,ఇది అద్భుతమైన విద్యావిధానము అనుటకు ఏ మాత్రము సందేహము లేదు .

లేకపొతే మనము కూర్చుని ఉన్న కొమ్మను మనమే నార్కొన్నట్లు అవుతుంది . ఇదితొందరపాటు తో తీసుకొనే నిర్ణయాలు రేపటి తరానికి శాపాలు కాకూడదు .

ప్రతీ బిడ్డ తన తల్లిని కోరుకుంటాడు గాని వేరే కారణాలు చూపుతూ పక్కవాడి తల్లి ని తన తల్లి అని అనుకోడు మాతృ భాష తల్లి పాలు లాంటివి .

స్టూడెంట్స్ యొక్క పేరెంట్ నిర్ణయాలు ద్వారా ఏ మీడియం తీసు కోవడము అన్నది కూడా సరియైనది కాదు. ప్రతీ స్టూడెంట్ పేరెంట్ అంతగా ఆలోచనను చేసి ఒక నిర్ణయం తీసుకుంటారనే నమ్మకము లేదు .

ఇది సరిఅయిన పరిస్కారం కాదు. దీనికి ఒక కమిటీ ఏర్పాటు చేసి విద్యావిధానంలో ఒక సములనమైన మార్పు తీసుకొని వచ్చి ,రేపటి తరానికి పూలబాట వేయాలి .

ఇంగ్లీష్ అన్నది ,మన మాతృ భాష కాదు .ఇలా అన్నవాళ్ళు అందరికి ఇంగ్లీషుకి వ్యతిరేకత లేదు. ఇంగ్లీష్, అయినా తెలుగు అయినా ఒకమనిషికి ఎంతవరకు అవసరమో ,తేల్చవలసినది మనవిద్యావిధానము లో ఉన్న లోపాలని తొలగించండి.

గవర్నమెంట్ స్కూల్స్ ,ప్రవేట్ స్కూల్స్ లో కూడా ఒకే సిలబస్ ఉంటే దానిని తగ్గా అవసరమైనవి గవర్నమెంట్ చేయగలిగితే ప్రతీ స్టూడెంటుకి ఉచిత విద్య (ప్రెవేట్ గవర్మెంట్ ) పూర్తిగా ప్రభుత్వమే భరించిన యెడల కొన్ని ఇయర్స్ కి మన సమాజము లో చాలా చాలా ఒక ఉన్నతిగల సమాజము ఏర్పడుతుంది .

అప్పుడు గవర్నమెంట్ కి కూడా ఈఉచితముగా అన్ని చేయడము తగ్గుతుంది .ప్రజల ఆలోచనా సరళి మార్పు వస్తుంది .

అంతే గాని ఇంగ్లీష్ మీడియం లో మార్చినంత లో ఎట్టి పరిస్థితి లో మార్పు రాదు .    మనది తెలుగు రాష్ట్రము ,తెలుగు అన్నది మన ఉనికి .

దానిని రచించ్చ వలసినది రాష్ట్ర ప్రభుత్వము. ప్రభుత్వానికి ప్రజలకి మేలు చేయబోయి చేయకూడని అన్న్యాయము చేసిన వారు అవుతారు.పెద్దల తో మాట్లాడి అందరికి ఆమోదయోగ్యమైన ఉన్నతి కి పునాదులు వేయండి .

తెలుగు భాష మన అమ్మ. అందులోనే విద్య కు మొదటి ఉన్నతి. ప్రతీ బిడ్డా తల్లి పురిటిపాలు అవసరమో ,అంతగా మాతృ భాషలో విధ్యా విధానము కోరుకోవటము చాలా అరిషించ వలసిన విషయము.

ఇక్కడ ఒకటి మనము మర్చి పోతున్నాము ,అది సిలబస్ లో తెలుగు,ఇంగ్లీష్, హిందీ ,సైన్స్ ,సోషల్, మేధ్స్,moralscience , ప్రెవేట్ స్కూల్స్ వాళ్ళ యొక్క సిలబస్ను ఎలా ప్రకటిస్తున్నాయో, అలానే రాష్ట్ర ప్రభుత్వము కూడా సిలబస్ను ప్రకటన చేస్తున్నలైతే ,పేరెంట్ కి కావలసింది వాళ్ళ బిడ్డల యొక్క ఉన్నతి .

ఏ ప్రభుత్వానికైనను కావలసింది కూడా స్టూడెంట్స్ యొక్క ఉన్నతి .ఒక విద్యార్థి ఒకటో తరగతి నుండి పదోవ తరగతి వరకూ వెచ్చించినదనిపదిహేను సంవ // లు .

అవిద్యార్థి తోపాటు మనదేశ ఆర్ధికపరిస్తి కూడా విద్యార్థి మన దేశము , రాష్ట్రము నకు ఉపయుక్త మైన విధ్యావిధము లో (రాష్ట్రా ) (సెంట్రల్ )గవర్నమెంట్ సరి అయినా విధానములు ఏర్పాటు చేయాలి .

మన విద్యార్థులు బాగా మంచి ఖ్వాలిఫికేషన్ వచ్చిన తరువాత పై దేశాల కి వెళ్లిపోవడము
వాళ్ళ యొక్క సర్వీసెస్ మన వాళ్లకు ఉపయోగ పడాలి .

విద్యార్థి కి కావలిసినది మంచి శిక్షణా ,దేశభక్తి ,ఉన్నతికి కావలసినది .ఇవి ఆలోచించ వలిసినది పేరెంట్ కాదు .దానికి కావలిసిన వసతులు ఏర్పాటు చేయాలి. మంచి విధ్యా ,మంచి ఆరోగ్యము కావాలి.

అవి కావాలంటే ఇంగ్లీష్ మీడియంకు మార్చగా నే మంచి విద్యావిధానము కాదు. ఒక పసి బిడ్డకు తల్లి పాలు ఎంత అవసరమో , ప్రతీ బిడ్డకు తన మాతృ భాషలో విద్యావిధానముఅంత హక్కుఉంది ,ఆవశ్యకతఉంది. దినిని ప్రతీ ఒక్కరు ఆలోచన చేయాలి. ఏ విషయములో
ఆలోచించినా ఇంగ్లీష్ మీడియం కన్నా ఒకటో తరగతి నుండి రెండు languages నేర్పుతూ ,3 వ .తరగతి నుండి నుండి హిందీ స్టార్ట్ చెయ్యాలి .

6 వ తరగతి నుండి మూడు లాంగ్వేజ్ కంటిన్యూ చేయాలి .ఎక్సమ్స్ మాత్రమూ తెలుగులో( సైన్స్ సోషల్ మాథ్స్ ) తెలుగుమాధ్యమము లోనే 10 th వరకూ ఈలా చేయగలిగితే ,నిజగముగా పిల్లల భావిషిత్ మన ముఖ్య మంత్రి కోరుకున్నట్లుగా బంగారు బాటగా నిలిస్తుంది. అనటంలో ఎలాంటి సందేహమూ లేదు.ఇది నా అభి ప్రాయము మాత్రమే .